అన్నయ్య నాగబాబు అంటే పవన్‌కి ఎంతో ఇష్టమో అందరికీ తెలిసిందే. నాగబాబు జనసేనకు పెద్ద దిక్కుగా మారి గత అయిదారేళ్లుగా పని చేస్తున్నారు. ఆ క్రమంలోనే నాగబాబుకు.. పవన్ పదవి ఇవ్వాలని చూస్తున్నారట. అదే ఫిలిం డెవలెప్‌మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్ పదవి అని సమాచారం. కేబినెట్ ర్యాంక్‌తో కూడిన ఈ పదవి సీనియర్ నటుడిగా ఉన్న నాగబాబుకు ఇవ్వడం న్యాయమని అభిమానులు అంటున్నారు.