Pawan Kalyan : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న భారీ చారిత్రక సినిమా ‘హరిహర వీరమల్లు’ ఎట్టకేలకు విడుదలకు సిద్ధమవుతోంది. ఈ పాన్-ఇండియా పీరియాడిక్ యాక్షన్ డ్రామా జూన్ 12న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. ఈ సినిమా ప్రమోషన్‌ను భారీ స్థాయిలో నిర్వహించేందుకు చిత్ర బృందం సన్నాహాలు చేస్తోంది. ఈ క్రమంలో వీరమల్లు సినిమా గ్రాండ్ ఈవెంట్‌ను కాశీలో నిర్వహించాలి అని ప్లాన్ చేస్తోంది. కాశీలో జరగనున్న ఈ గ్రాండ్ ఈవెంట్‌కు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ను ఆహ్వానించాలని చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తోంది. ఈ సినిమా పవన్ కళ్యాణ్ కెరీర్‌లో అత్యంత భారీ ప్రాజెక్ట్‌లలో ఒకటిగా రూపొందుతోంది. కాశీలో యోగి ఆదిత్యనాథ్‌ను ఆహ్వానించే ప్లాన్, తిరుపతిలో ప్రీ-రిలీజ్ ఈవెంట్‌తో పాటు, ఈ సినిమాకి జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చే అవకాశం ఉంది. ఈ సినిమా షూటింగ్ 2020 సెప్టెంబర్‌లో ప్రారంభమైంది, కానీ కరోనా మహమ్మారి, పవన్ కళ్యాణ్ రాజకీయ బాధ్యతలు, ఇతర సినిమా కమిట్‌మెంట్స్ కారణంగాచాలా సార్లు వాయిదా పడింది. ఇటీవలే ఈ సినిమా షూటింగ్ దాదాపు పూర్తయింది. దాదాపు 5 ఏళ్ల తరువాత రిలీజ్ అవుతున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి.