Homeహైదరాబాద్latest NewsPawan Kalyan : పవన్ కోసం యోగి ఆదిత్యనాథ్.. "వీరమల్లు" ప్రీ రిలీజ్ ఈవెంట్ డేట్...

Pawan Kalyan : పవన్ కోసం యోగి ఆదిత్యనాథ్.. “వీరమల్లు” ప్రీ రిలీజ్ ఈవెంట్ డేట్ ఫిక్స్..!!

Pawan Kalyan : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన భారీ చారిత్రక పాన్-ఇండియా సినిమా “హరిహర వీరమల్లు” ఎట్టకేలకు విడుదలకు సిద్ధమవుతోంది. 17వ శతాబ్దం నేపథ్యంలో రూపొందుతున్న ఈ పీరియాడిక్ యాక్షన్ డ్రామా సినిమా జులై 24న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. క్రిష్ జాగర్లమూడి మరియు ఎ.ఎం. జ్యోతికృష్ణ దర్శకత్వంలో మెగా సూర్య ప్రొడక్షన్స్ బ్యానర్‌పై ఎ.ఎం. రత్నం సమర్పణలో, ఎ. దయాకర్ రావు నిర్మించిన ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

ఈ సినిమా ప్రమోషన్‌లో భాగంగా జులై 17న ఉత్తరప్రదేశ్‌లోని వారణాసిలో ఒక భారీ ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించేందుకు చిత్ర బృందం సన్నాహాలు చేస్తోంది. ఈ ఈవెంట్‌కు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ను ముఖ్య అతిథిగా ఆహ్వానించాలని నిర్మాత ఎ.ఎం. రత్నం ప్లాన్ చేస్తున్నారు. వేలాది మంది అభిమానుల సమక్షంలో ఈ ఈవెంట్‌ను అత్యంత ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. వారణాసి ఈవెంట్ తర్వాత జులై 19న తిరుపతిలో మరో గ్రాండ్ ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించనున్నారు.

Recent

- Advertisment -spot_img