Homeహైదరాబాద్latest Newsపవన్ కల్యాణ్ 'సీజ్ ద షిప్' పెద్ద డ్రామా : పేర్ని నాని

పవన్ కల్యాణ్ ‘సీజ్ ద షిప్’ పెద్ద డ్రామా : పేర్ని నాని

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కాకినాడ పర్యటనపై వైసిపి నేత, మాజీ మంత్రి పేర్ని నాని స్పందించారు. కెన్ స్టార్ షిప్ దగ్గరకు ఎందుకు వెళ్లలేదు..? సీజ్ ద షిప్ అని ఎందుకు అనలేదు..? అని పేర్ని నాని ప్రశ్నించారు.స్టెల్లా షిప్ లో రేషన్ బియ్యం స్మగ్లింగ్ మాత్రమే మీకు కనిపించిందా పవన్ కళ్యాణ్ అని నిలదీశారు. కెన్ స్టార్ షిప్ లోకి వెళ్లేందుకు మీకు ఎవరు అనుమతి ఇవ్వలేదు..? అని నాని ప్రశ్నించారు. పవన్ కళ్యాణ్ గారిని రిక్వెస్ట్ చేస్తున్న.. మీరు నిజాయతీగా దమ్ముగా సముద్రంలోకి వెళ్లారు కదా.. కెన్ స్టార్ షిప్ దగ్గరికి కూడా వెళ్ళండి. సీఎం చంద్రబాబు వెళ్ళదు అన్నారా అని పవన్ కళ్యణ్ ని పేర్ని నాని ప్రశ్నించారు. ఇది పవన్ డ్రామానా..? చంద్రబాబు డ్రామానా..? అని నాని నిలదీశారు. ప్రస్తుత ఆర్థిక మంత్రి వియ్యంకుడు ఓడలో బియ్యం రవాణా చేస్తున్నట్లు సమాచారం ఉంది అని పేర్ని నాని అన్నారు.

Recent

- Advertisment -spot_img