HomeసినిమాPayal Ghosh : If you speak Telugu well, you will marry him..!...

Payal Ghosh : If you speak Telugu well, you will marry him..! Payal Ghosh : English​ బాగా మాట్లాడితే అతడిని పెళ్లి చేసుకుంటా..!

బాలీవుడ్ నటి పాయల్​ ఘోష్ తాజాగా చేసిన ఓ ట్వీట్ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. వన్డే ప్రపంచకప్‌ టోర్నీలో టీమ్‌ఇండియా పేసర్‌ షమీ ఫుల్ ఫామ్​లో ఉన్న సంగతి తెలిసిందే. ఆడింది నాలుగు మ్యాచ్‌లే అయినా 16 వికెట్లు తీసి అదరగొట్టాడు. అతడి పాయల్‌ ఘోష్‌ ఫిదా అయింది. ఏకంగా అతడికి పెళ్లి ప్రతిపాదనే చేసేసింది. ‘షమీని పెళ్లి చేసుకోవడానికి నేను సిద్ధంగా ఉన్నాను’అంటూ పాయల్‌ ఘోష్‌ ఇటీవల తన ఎక్స్‌ ఖాతాలో ఓ పోస్ట్ చేసింది. అయితే, ఇందుకు ఓ షరతు కూడా పెట్టింది. షమీ తన ఇంగ్లిష్‌ను మెరుగుపర్చుకుంటే తాను పెళ్లి చేసుకుంటానని చెప్పింది. ఆమె పోస్ట్‌కు నెటిజన్లు డిఫరెంట్ కామెంట్లు పెడుతున్నారు. ‘ప్రేమకు భాషతో పనేంటి?’అని కొందరు కామెంట్లు చేయగా..‘షమీ ఎలా స్పందిస్తాడో మరి’ అంటూ ఇంకొందరు ఫన్నీగా రాస్తున్నారు. ఏదేమైనా.. ప్రస్తుతం ఈ పోస్ట్‌ నెట్టింట వైరల్‌గా మారింది. బాలీవుడ్‌ నటి, రాజకీయ నాయకురాలైన పాయల్‌ ఘోష్‌ 2009 వచ్చిన మంచు మనోజ్‌ సినిమా ‘ప్రయాణం’మూవీతో టాలీవుడ్​కు పరిచయమైంది. ఆ తర్వాత బాలీవుడ్‌కు వెళ్లిపోయిన సంగతి తెలిసిందే.

Recent

- Advertisment -spot_img