హైదరాబాద్: బాలీవుడ్ టాప్ డైరెక్టర్ అనురాగ్ కశ్యప్ తనను రూమ్‌కి పిలిచి బ్లూ ఫిల్మ్ చూపడమే కాకుండా తన ఫ్యాంట్ జిప్ తీసి.. వికృతంగా ప్రవర్తించాడని సినీ నటి పాయల్ ఘోష్ ఆరోపించింది. తనతో చాలా మందికి సంబంధాలు ఉన్నాయని.. ఫిల్మ్ ఇండస్ట్రీలో ఇవన్నీ కామన్ అని తనను బలవంతం చేశాడని కూడా పేర్కొంది. దయచేసి అతని ముసుగు వెనుక ఉన్న రాక్షసుడిని దేశానికి చూపించండని, ఇది నాకు హాని కలిగిస్తుందని, నా భద్రతకు ప్రమాదమని తెలుసని, అతనిపై వెంటనే చర్యలు తీసుకుని సాయం అందించండని ఏకంగా ప్రధాని మోడీకి ట్యాగ్ చేస్తూ ట్విట్ చేయడం ఇప్పడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అనురాగ్‌పై నెటిజన్లు దుమ్మెత్తిపోస్తున్నారు. పాయల్ ఆరోపణలపై డైరెక్టర్ అనురాగ్ స్పందించాల్సి ఉంది.
రూమ్‌కి పిలిచి ప్యాంట్ జిప్ తీసి.. టాప్ డైరెక్టర్ బాగోతం బయటపెట్టిన నటి
RELATED ARTICLES