Homeఆంద్రప్రదేశ్​టీడీపీ ఫైర్ బ్రాండ్ సైలెంట్ వెనుక మ‌ర్మ‌మేంటీ?

టీడీపీ ఫైర్ బ్రాండ్ సైలెంట్ వెనుక మ‌ర్మ‌మేంటీ?

అమ‌రావ‌తిః టీడీపీలో రాయ‌ల‌సీమ వ్య‌వ‌హారాలు చూసే వాళ్ల‌లో ఆయ‌న ఒక కీల‌క నేత‌. టీడీపీ అధినేత చంద్ర‌బాబుకు స‌న్నిహితుల్లో ఆయ‌న ఒక‌రు. టీడీపీలో ఆయ‌న‌కు ఫైర్ బ్రాండ్‌గా పేరు గ‌డించారు. ఏ విష‌యంపైనైనా అన‌ర్గ‌ళంగా, అర్ధ‌వంతంగా వాదించి మెప్పించ‌గ‌ల‌రు. అవ‌త‌ల పార్టీని ఇరుకున పెట్టే నైపుణ్యాలు మెండుగా ఉన్న నేత‌. సోష‌ల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే నేత‌. రాజ‌కీయాల్లో సుధీర్ఘ అనుభ‌వం ఉన్న నేత ఉన్న‌ప‌ళంగా సైలెంట్ అయ్యారు. టీడీపీ వ్య‌వ‌హారాల్లోనూ స్పందించ‌డం లేదు. నిత్యం మీడియా ముందు నిలిచే ఆ రాయ‌ల‌సీమ నేత ఉద్దేశ పూర్వ‌కంగానే క‌నుమ‌రుగైనాడని మీడియా మిత్రుల గుస‌గుస‌లు. ఉన్నట్టుండి ఆ నేత ఎందుకు కనిపించకుండా పోయారు. రాయ‌ల‌సీమ‌లో టీడీపీకి కీల‌క నేత ఇలా సైలెంట్ అవ్వ‌డంపై సొంత పార్టీ నేత‌లే ఆశ్చ‌ర్యం వ్య‌క్తం చేస్తున్నారు. ఈ చ‌ర్చ అంత టీడీపీ సీనియర్ నేత, ఉరవకొండ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ గురించే.
ప‌య్యావుల గ‌త కొంత కాలంగా మీడియాకు దూరంగా ఉంటున్నారు. పార్టీ ఏ చిన్న విష‌య‌మైన స్పందించే ఆయ‌న ఇటీవ‌ల అచ్చెన్నాయుడు, జేసీ ఫ్యామిలీ, మాజీ మంత్రి కొల్లు రవీంద్రల అరెస్ట్‌ల అంశంపైనా ఆయన పెద్దగా మాట్లాడలేదు. ఇక జేసీ కుటుంబాన్ని పరామర్శించడానికి టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ తాడిపత్రి వచ్చిన సమయంలో కూడా పయ్యావుల ఆ పర్యటనకు దూరంగా ఉన్నారు. అప్పుడే పార్టీలో చర్చ జరిగింది. అధినేత కుమారుడు వచ్చినా ఎందుకు వెళ్లలేదని ప్రశ్న తెరపైకి వచ్చింది. ఆ తర్వాత కూడా పయ్యావుల కేశవ్ ఎక్కడా కనిపంచలేదు.
రాజకీయంగా యాక్టివ్‌గా ఉండే పయ్యావుల మౌనం వెనుక వ్యూహం ఏదైనా ఉందా.. అధిష్టానం తీరుపై గుర్రుగా ఉన్నారా.. కరోనా సమయం కాబట్టి సైలెంట్ అయ్యారా.. అధికార పార్టీ దెబ్బకు మౌనమే మంచిదనుకున్నారా.. వంటి ప్రశ్నలు పార్టీ వ‌ర్గాల్లో చ‌ర్చ‌గా మారాయి. పీఏసీ ఛైర్మన్ పదవి
అప్పగించినా కేశవ్ ఎందుకు పార్టీకి దూరంగా ఉంటున్నారనే చర్చ జరుగుతోంది. దీనిపై ఆయన స్పందించాల్సి ఉంది.

RELATED ARTICLES

Recent

- Advertisment -spot_img