PCC CHIEF REVANTH REDDY FIRE ON CM KCR IN GAJWEL : పోడు భూములను హరితహారం కింద గుంజుకున్నారని పీసీసీ ఛీప్ రేవంత్‌రెడ్డి అన్నారు.
సిద్దిపేట జిల్లా గజ్వేల్లో జరిగిన దళిత, గిరిజన దండోర సభలో రేవంత్ ప్రసంగించారు.
కొండపోచమ్మ ప్రాజెక్టు కింద 14 గ్రామాలను నట్టేట ముంచారని పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు.
14 గ్రామాల ప్రజలకు నిలువ నీడ లేకుండా చేశారని చెప్పారు. తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన ఘనత సోనియాదే అని చెప్పారు.
రాష్ట్రం వచ్చాక కేసీఆర్ కాంగ్రెస్‌కు వెన్నుపోటు పొడిచారని ఆరోపించారు. 12 శాతం ఉన్న మాదిగలకు ఒక్క మంత్రి పదవైనా ఇచ్చారా? అని రేవంత్‌రెడ్డి ప్రశ్నించారు.
కేసీఆర్ ఇంట్లో వాళ్లందరికీ పదవులు ఇచ్చారని దయ్యబట్టారు. పోడు భూములను హరితహారం కింద గుంజుకున్నారని రేవంత్‌రెడ్డి అన్నారు.
పల్లెల్లో 4 వేలకు పైగా బడులు బంద్ చేశారని తెలిపారు.
మైనార్టీల రిజర్వేషన్లు 12 శాతం చేస్తామని చెప్పి ఏడేళ్లు దాటిందని.. ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ తుంగలో తొక్కారని రేవంత్‌రెడ్డి విమర్శించారు.
ఇంద్రవెల్లిలో మొదటి సభ పెట్టినప్పుడు బిడ్డా మీరు గజ్వేల్ రండి.. చూసుకుంటాం అన్నారు.
ఆరోజే చెప్పాను గజ్వేల్ గడ్డ మీద కదం తొక్కుతామని. ఒక్కరు కాదు.
లక్ష మంది సైనికులతో వస్తా అని చెప్పిన. ఈరోజు గజ్వేల్ నుంచి 20 కిలోమీటర్ల వరకు ఇసుక వేస్తే రాలనంతగా.. తిరుపతి తిరునాళ్లలో.. యాదగిరిగుట్ట నర్ససింహస్వామి దగ్గర బ్రహ్మోత్సవాలు చేస్తే ఎట్ల జనం వస్తరో అట్ల వచ్చారు.
లక్ష మంది కాదు రెండు లక్షలు మంది కదం తొక్కారు.
-రేవంత్ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు