ఏపీలో శాంతి భద్రతలే కీలకమని సీఎం చంద్రబాబు ఇవాళ అసెంబ్లీలో అన్నారు. పోలీసు వ్యవస్థను ప్రక్షాళన చేస్తున్నామని వెల్లడించారు. సైబర్ నేరాల అదుపునకు ప్రతి జిల్లాలో సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. తుళ్లూరులో ఫోరెన్సిక్ సైన్స్ లేబొరేటరీని ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. భవిష్యత్తులో ఎవరైనా ఆడపిల్లలను వేధిస్తే ఏం చేయాలో చేసి చూపిస్తానని సీఎం చంద్రబాబు ఇవాళ అసెంబ్లీలో అన్నారు. దేశం మొత్తం అధ్యయనం చేసి మహిళల భద్రత కోసం చట్టాలు చేశామన్నారు. నేరస్థుల గుండెల్లో రైళ్లు పరుగెత్తేలా లా అండ్ ఆర్డర్ ఉంటుందని స్పష్టం చేశారు. గత ప్రభుత్వం ఏపీ డిజిటల్ కార్పొరేషన్ ఏర్పాటు చేసి అందులో వైసీపీ వాళ్లనే ఉద్యోగులుగా నియమించింది. వారి చేత అసభ్యంగా పోస్టులు పెట్టించారని చంద్రబాబు ఆరోపించారు.భవిష్యత్తులో నేరస్థుల గుండెల్లో రైళ్లు పరుగెత్తేలా లా అండ్ ఆర్డర్ ఉంటుంది అని స్పష్టం చేశారు.