Homeజిల్లా వార్తలుదైవచింతనతో మానసిక ప్రశాంతత.. ప్రతి ఒక్కరు ఆధ్యాత్మిక చింతన కలిగి ఉండాలి: మాజీ ఎమ్మెల్యే రమావత్...

దైవచింతనతో మానసిక ప్రశాంతత.. ప్రతి ఒక్కరు ఆధ్యాత్మిక చింతన కలిగి ఉండాలి: మాజీ ఎమ్మెల్యే రమావత్ రవీంద్ర కుమార్.

ఇదే నిజం, దేవరకొండ: ప్రతి ఒక్కరు శివుని అనుగ్రహం పొందాలి అని బిఆర్ఎస్ పార్టీ నల్గొండ జిల్లా అధ్యక్షులు, దేవరకొండ మాజీ శాసనసభ్యులు రమావత్ రవీంద్ర కుమార్ అన్నారు. గురువారం దేవరకొండ మండలం మంగలోనిబావి గ్రామంలో లింగమయ్య పండుగ సందర్భగా శివాలయంలో మాజీ శాసన సభ్యులు రమావత్ రవీంద్ర కుమార్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ.. దైవచింతనతో మానసిక ప్రశాంతత లభిస్తుంది అని ఆయన అన్నారు. ప్రతి ఒక్కరు ఆధ్యాత్మిక చింతన కలిగి ఉండాలి అని అయన అన్నారు. అనంతరం మాజీ ఎమ్మెల్యే రవీంద్ర కుమార్ ని సన్మానించారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ జిల్లా నాయకులు బొడ్డు గోపాల్ గౌడ్, బొడ్డుపల్లీ కృష్ణ, రమావత్ తులిసిరామ్, ఏటేల్లి పార్వతయ్య, వెంకటయ్య, కొండల్, సయ్యద్, తదితరులు ఉన్నారు.

Recent

- Advertisment -spot_img