పెగాసస్.. ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశం. ప్రముఖుల ఫోన్లు సరే. మరి మన ఫోన్‌కు వచ్చే అనేక లింకుల సంగతేంటి? వాటిల్లో పెగాసస్ స్పై వేర్ ఉంటే.. మనకు వచ్చిన లింక్‌కు పెగాసస్‌కు ఏమైనా సంబంధం ఉందా.. ఉంటే తెలుసుకోవడం ఎలా.. ఇలాంటి ఆలోచనలు మీకు వచ్చే ఉంటాయి. ఇది తెలుసుకోవడానికే ‘ఫ్రీ సాఫ్ట్‌వేర్ మూవ్‌మెంట్ ఆఫ్ ఇండియా(ఎఫ్‌ఎస్‌ఎంఐ)’ ఉచితంగా ‘స్పైవేర్ డిటెక్టర్ టూల్’ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ టూల్ టెలిగ్రామ్ మెసేజింగ్ యాప్ ద్వారా అందుబాటులో ఉంటుంది. ఈ మేరకు ఎఫ్‌ఎస్‌ఎంఐ జనరల్ సెక్రెటరీ, ఐటీ నిపుణుడు కిరణ్ చంద్ర వివరాలు వెల్లడించారు.
- టెలిగ్రామ్ యాప్‌ను ఇన్‌స్టాల్ చేసుకోవాలి
- సెర్చ్ బాక్స్‌లో @fsmi_pegasus_detector_bot అని టైప్ చేయాలి. డిటెక్టర్ బోట్ ఓపెన్ అవుతుంది. స్టార్ట్ అని ఆప్షన్ వస్తుంది. దానిపై క్లిక్ చేయాలి.
- మీ ఫోన్‌కు వచ్చిన అనుమానాస్పద లింకును ఎంటర్ చేయాలి.
- ఆ లింక్ పెగాసస్‌కు సంబంధించిందో.. కాదో తెలుస్తుంది.