Homeహైదరాబాద్latest NewsAP : మహిళపై రెచ్చిపోయిన పిన్నెల్లి

AP : మహిళపై రెచ్చిపోయిన పిన్నెల్లి

వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి ఉచ్చు బిగుస్తోంది. రాష్ట్ర ఎన్నికల సంఘం ఆయనపై లుకౌట్ నోటీస్ జారీ చేసింది. ఆయన అనుచరులు కొందరు పట్టుబడ్డారు. పోలింగ్ రోజు ఈవీఎంను ధ్వంసం చేసిన వీడియోతో ఆయన పరువు పోయింది. ఒక ప్రజాప్రతినిధిగా బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సిన వ్యక్తి హద్దులు మీరాడంటూ పలువురు దుమ్మెత్తిపోస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా తమ నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఏం చూసుకొని ఇంత అహంకారం అంటూ సాధారణ వ్యక్తుల దగ్గర నుంచీ ప్రముఖుల వరకూ వేలెత్తి చూపిస్తున్నారు. రౌడీలా ఉన్నాడంటూ కామెంట్లు చేస్తున్నారు.

ఏపీలో జరిగిన హింసాత్మక ఘటనలకు సంబంధించి ఏర్పాటైన సిట్ (ప్రత్యేక దర్యాప్తు బృందం) ఘర్షణలు జరిగిన ప్రాంతాల్లో పోలింగ్ బూత్ వెబ్‌కామెరాలను పరిశీలించింది. రికార్డు అయిన వీడియోలను క్షుణ్ణంగా అబ్జర్వ్ చేసింది. ఈ క్రమంలో పల్నాడు జిల్లా రెంటచింతల మండలం పాల్వాయి గేటు పోలింగ్ బూత్‌లోకి వైసీపీ ఎమ్మెల్యే దౌర్జన్యంగా వెళ్లాడు. విర్రవీగిన అహంకారంతో అక్కడున్న రెండు ఈవీఎంలో ఒకదానికి నేలకేసి కొట్టి తన ప్రతాపాన్ని చూపించాడు. ఈ వీడియో అధికారులు గమనించి ఆయనపై లుకౌట్ నోటీస్ జారీ చేశారు. ప్రస్తుతం ఆయన అనుచరులు కొందరు తెలంగాణలోని సంగారెడ్డి జిల్లా కందిలో పట్టుబడ్డారు. ఇదిలా ఉండగా పిన్నెల్లికి సంబంధించి మరో వీడియో హల్‌చల్ చేస్తోంది. పోలింగ్ బూత్ నుంచి బయటికి వచ్చిన తర్వాత ఓ మహిళతో వాగ్వాదానికి దిగాడు. ఎదిరించిన ఆ మహిళను బూతులు తిట్టాడు. వేలు చూపించి బెదిరించాడు.

పిన్నెల్లి విదేశాలకు పారిపోమే ప్లాన్‌లో ఉన్నట్లు పోలీసులు భావిస్తున్నారు. ఈ క్రమంలోనే ఏపీ పోలీసులు సంగారెడ్డి పోలీసులకు సమాచారం అందిచారు. నేషనల్ హైవే 65 మీదుగా వెళ్తోన్న పిన్నెల్లి అనుచరులను పోలీసులు పట్టుకున్నారు.

Recent

- Advertisment -spot_img