Homeహైదరాబాద్latest NewsPension: తెలంగాణలో కొత్త పెన్షన్ల కసరత్తు మొదలు.. త్వరలో వారికి గుడ్ న్యూస్..!

Pension: తెలంగాణలో కొత్త పెన్షన్ల కసరత్తు మొదలు.. త్వరలో వారికి గుడ్ న్యూస్..!

Pension: తెలంగాణ రాష్ట్రంలో కొత్త పెన్షన్ల మంజూరుకు ప్రభుత్వం కసరత్తు మొదలుపెట్టింది. జిల్లాల వారీగా అర్హుల జాబితా సిద్ధం చేయాలని కలెక్టర్లకు ఆదేశాలు జారీ అయ్యాయి. సుమారు 5.20 లక్షల పెండింగ్ దరఖాస్తులపై క్షేత్రస్థాయి పరిశీలన జరగనుంది. ప్రస్తుతం రాష్ట్రంలో 43 లక్షల మంది వివిధ కేటగిరీల కింద పెన్షన్లు పొందుతున్నారు, ఇందులో దివ్యాంగులకు నెలకు రూ.4,016, ఇతరులకు రూ.2,016 అందుతోంది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నూతన పెన్షన్ల కోసం దరఖాస్తులు స్వీకరించింది. ఈ దరఖాస్తులను పరిశీలించి, అర్హత ఆధారంగా పెన్షన్లు మంజూరు చేసేందుకు సమీక్షలు జరుగుతున్నాయి. పేదరిక నిర్మూలన సంస్థ (SERP) ఈ ప్రక్రియలో కీలక పాత్ర పోషిస్తోంది.

Recent

- Advertisment -spot_img