Homeజాతీయం50ఏళ్లకే పెన్షన్.. ఎక్కడో తెల్సా..

50ఏళ్లకే పెన్షన్.. ఎక్కడో తెల్సా..

– జార్ఖండ్ సీఎం కీలక నిర్ణయం

ఇదేనిజం, నేషనల్ బ్యూరో: జార్ఖండ్‌ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వచ్చే ఏడాది నవంబర్లో అక్కడ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న దళితులు, ఆదివాసీలకు న్యూఇయర్‌ కానుకగా.. వృద్ధ్యాప్య పెన్షన్ అర్హత వయసును పదేళ్లు తగ్గించారు. దళితులు, ఆదివాసీలకు ఇక నుంచి 50 ఏళ్లకు పెన్షన్ అందిస్తామని వెల్లడించారు. రాష్ట్రంలో సోరెన్ ప్రభుత్వం ఏర్పడి నాలుగేళ్లు పూర్తవుతున్న సందర్భంగా సీఎం సీఎం హేమంత్ సోరెన్ ఈ ప్రకటన చేశారు. డిసెంబర్‌ 29వ తేదీ నాటికి జార్ఖండ్‌లో సోరెన్ నేతృత్వంలోని సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడి సరిగ్గా నాలుగేళ్లు పూర్తవుతుంది. ఈ సందర్భంగా రాంచీలో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ బేటీలో పాల్గొని మట్లాడిన సీఎం హేమంత్ సోరెన్ కీలక ప్రకటనలు చేశారు. రాష్ట్రంలోని ఆదివాసీ, దళితులకు ఇక నుంచి 50 ఏళ్లు దాటితే వృద్ధ్యాప్య పెన్షన్ ఇవ్వనున్నట్లు చెప్పారు. అంతేకాదు.. జార్ఖండ్‌లో ఏర్పాటు చేసే కంపెనీల్లో 75 శాతం ఉద్యోగాలను స్థానికులకే కేటాయిస్తామని చెప్పారు.

RELATED ARTICLES

Recent

- Advertisment -spot_img