ఏపీలోని అంబేద్కర్ కోనసీమ జిల్లాలో పెన్షన్ గోల్‌మాల్ జరిగింది. పెన్షన్ అనర్హుల ఏరివేతకు క్షేత్రస్థాయిలో వైద్యాధికారులు పరిశీలిన జరుగుతోంది. ఈ క్రమంలో అర్హత లేకపోయినా, తప్పుడు ధృవీకరణ పత్రాలతో పలువురు దివ్యాంగుల పెన్షన్లు పొందుతున్నట్లు వైద్యాధికారుల దృష్టికి వచ్చింది. 26 మందికి రాజమండ్రి, కాకినాడ, అమలాపురం మెడికల్ బోర్డులు తప్పుడు ధ్రువీకరణ పత్రాలు ఇచ్చాయి. వీరు నెలకు రూ.15 వేలు పొందుతున్నట్లు వైద్యాధికారులు గుర్తించారు.