Pensions : పెన్షన్ దారులకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. కొత్త పింఛన్ల (Pensions) మంజూరుకు సంబంధించి కీలక సమాచారం వెలువడింది. ఈ మేరకు సెర్ప్ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ కీలక ప్రకటన చేశారు. రాష్ట్రంలోని 93 వేల మంది వితంతువులకు మే నెల నుండి కొత్త పెన్షన్లు ఇస్తామని ఆయన తెలిపారు. ఈ కొత్త పెన్షన్లలో ఎక్కువ మంది లబ్దిదారులకు ప్రతి నెలా రూ.4,000 చొప్పున అందనుంది. విజయనగరం జిల్లా గంటియాడ గ్రామంలో ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు. రాష్ట్రంలో దాదాపు 5 లక్షల మంది కొత్త మందికి పెన్షన్లకు అర్హులని, వారందరికీ త్వరలో మంజూరు చేస్తామని ఆయన పేర్కొన్నారు.