ఇదే నిజం, ముస్తాబాద్: ముస్తాబాద్ మండలం పోతుగల్ బీజేపీ గ్రామ శాఖ ఆధ్వర్యంలో అర్హులైన వారికి ఆసరా పింఛన్ మంజూరు చేయాలని ముస్తాబాద్ మండల పరిషత్ కార్యాలయంలో బీజేపీ నాయకులు పెన్షన్ దరఖాస్తుదారులు కలిసి ఎంపీడీవో రాజేందర్ కు వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పోతుగల్ గ్రామం నుండి గత కొన్ని సంవత్సరాల నుండి అర్హులైన బీడీ పెన్షన్, ఆసరా పెన్షన్ లు మంజూరు చేయడం లేదని చాలా సార్లు పెన్షన్ కోసం దరఖాస్తులు చేసుకున్నా కానీ మంజూరు కావడం లేదని వారు తెలిపారు. గత ప్రభుత్వంలో చేసిన పెన్షన్ కూడా చాలామందికి గల్లంతయి పెన్షన్ రాలేదని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు హామీలు ఇచ్చి గద్దెనెక్కి వంద రోజులు లోపే అర్హులైన వారికి అందరికీ పింఛన్ ఇస్తామని చెప్పి 200 రోజులు అవుతున్న ఇంతవరకు ఆసరా బీడీ పింఛన్, వికలాంగుల పింఛన్ మంజూరు చేయడం లేదని వారు అన్నారు. వెంటనే రాష్ట్ర ప్రభుత్వం అర్హులైన వారికి పెన్షన్లు మంజూరు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు కోళ్ల కృష్ణ, చికోటి మహేష్, చిట్టినేని శ్రీనివాసరావు, కస్తూరి కార్తీక్ రెడ్డి, నాంపల్లి కనకయ్య, రంజిత్, ఆకాష్, మధు, ఆసరా పింఛన్ మహిళ దరఖాస్తుదారులు, తదితరులు పాల్గొన్నారు.