Homeహైదరాబాద్latest News'కవిత అరెస్టుతో ప్రజలు సంతోషంగా ఉన్నారు' : Konda Surekha

‘కవిత అరెస్టుతో ప్రజలు సంతోషంగా ఉన్నారు’ : Konda Surekha

కవిత అరెస్టుతో తెలంగాణ ప్రజలు సంతోషంగా ఉన్నారని దేవాదాయ శాఖ మంత్రి Konda Surekha వ్యాఖ్యానించారు. వరంగల్ తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయ ప్రారంభంలో ఆమె మాట్లాడారు. Megha Engineering and Infrastructures Ltd  వాళ్ళు కోట్ల రూపాయలు ఆఫర్ చేయడం వల్లే మేడిగడ్డ విషయంలో బీజేపీ ప్రభుత్వం మాట్లాడకుండా ఉందని ఆరోపించారు. ‘త్వరలో బొంది వాగు ప్రాజెక్ట్ ఫండ్ రాబోతుందని’ ప్రజలకు ఇబ్బందులు రాకుండా చూసుకుంటామన్నారు. పార్టీలో కొత్తగా చేరినవారిని తగిన గౌరవం ఇస్తామన్నారు. దేవాదాయ శాఖలో ఉన్నందుకు సంతోషంగా ఉన్నట్లు చెప్పారు. వరంగల్‌లో ఉన్న ప్రతీ దేవాలయాన్ని అభివృద్ధి చేస్తామని, దేవాదాయ భూములను దేవుళ్ల పేరిట పాస్ పుస్తకాలను ఏర్పాటు చేస్తే మంచిదన్నారు.

Recent

- Advertisment -spot_img