Homeతెలంగాణకేసీఆర్​ మీద ప్రజలకు వ్యతిరేకత లేదు

కేసీఆర్​ మీద ప్రజలకు వ్యతిరేకత లేదు

– విశ్వాసం, ప్రేమ అలాగే ఉన్నాయి
– ఆరు గ్యారెంటీలు నమ్మి ఓట్లేశారు
– కేసీఆర్​ రావాలి.. మా ఎమ్మెల్యే పోవాలని జనం అనుకున్నారు
– మండలి చైర్మన్​ గుత్తా సుఖేందర్​ రెడ్డి

ఇదే నిజం, తెలంగాణ బ్యూరో: కేసీఆర్​ మీద ప్రజలకు ఎటువంటి వ్యతిరేకత లేదని మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్​ రెడ్డి పేర్కొన్నారు. ప్రజలకు ఆయన మీద ప్రేమ, విశ్వాసం అలాగే ఉన్నాయన్నారు. సోమవారం నల్లగొండలోని తన క్యాంపు కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రజలు కేవలం ఆరు గ్యారెంటీలు నమ్మి కాంగ్రెస్​ పార్టీకి ఓట్లు వేశారన్నారు. కేసీఆర్‌ రావాలి-మా ఎమ్మెల్యేలు పోవాలని ఓటర్లు అనుకున్నట్లు ఉందన్నారు. జీహెచ్‌ఎంసీ పరిధిలో బీఆర్ఎస్‌ ఎమ్మెల్యేలు, కేటీఆర్ పనితీరుకు ఓట్లు పడ్డాయని తెలిపారు. తాను పార్టీ మారుతున్నట్లు సోషల్ మీడియాలో దుష్ప్రచారంజరుగుతుందన్నారు. పార్టీ మారాల్సిన అవసరం తనకు లేదని స్పష్టం చేశారు. రాజ్యాంగబద్ధమైన శాసన మండలి చైర్మన్ పదవీలో ఉన్నానని, తనకు ఏ పార్టీతో సంబంధం లేదని చెప్పారు. చట్టబద్ధంగా కర్తవ్యాన్ని నిర్వహిస్తానని, ప్రభుత్వానికి సంపూర్ణ సహకారం ఉందని తెలిపారు. ప్రభుత్వానికి అవసరమైన సలహాలు, సూచనలు అందిస్తామని తెలిపారు. కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం కూడా సాధ్య అసాధ్యలను బేరీజు వేసుకోవాలని సూచించారు. ప్రజలకు వాస్తవ పరిస్థితి వివరించి పథకాలు అమలు చేయాలని, వాస్తవాలు చెబితే ప్రజలు తప్పకుండా అర్ధం చేసుకుంటారిన చెప్పారు. బీఆర్‌ఎస్‌ అధిష్టానం కూడా ప్రజలు తమకు వ్యతిరేకంగా తీర్పు ఎందుకిచ్చారని విశ్లేషన చేసుకుంటున్నదని తెలిపారు.

Recent

- Advertisment -spot_img