– అమిత్‌షా సవాల్‌ను స్వీకరిస్తూ కౌంటర్ ఇచ్చిన చత్తీస్‌గఢ్ సీఎం భూపేశ్ బఘేల్
– ట్విట్టర్లో సోఫా ఫొటోను షేర్ చేస్తూ సెటైర్
ఇదే నిజం, నేషనల్ బ్యూరో: చత్తీస్‌గఢ్‌లో అధికారం కోసం కాంగ్రెస్, బీజేపీ తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. ఈ క్రమంలో సీఎం భూపేశ్ బఘేల్ ఒక సోఫా ఫొటోను సోషల్ మీడియాలో పోస్టు చేశారు. బీజేపీ అగ్రనేత అమిత్ షా సవాల్‌ను స్వీకరిస్తూ.. డేట్, టైం చెప్పడంటూ ట్వీట్ చేశారు. ఈ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా బీజేపీ పాలిత రాష్ట్ర ప్రభుత్వాల రిపోర్టు కార్టులు చూపించాలని ఆ పార్టీని కొద్ది రోజుల క్రితం కాంగ్రెస్ డిమాండ్ చేసింది. దీనిపై అమిత్ షా స్పందిస్తూ.. ‘ధైర్యముంటే చత్తీస్‌గఢ్‌లో ఐదేళ్లలో చేసిన అభివృద్ధి పనుల గురించి చర్చించడానికి సిద్ధమా..?’అని సవాల్ విసిరారు. బఘేల్ ఈ సవాల్‌ను స్వీకరించారు. ‘ఐదేళ్లలో మేం చేసిన అభివృద్ధి గురించి, అంతకుముందు రాష్ట్రంలో 15 ఏళ్ల బీజేపీ పాలనలో చోటుచేసుకున్న కుంభకోణాలపై చర్చ జరగాలి. మీ సమాధానం కోసం ఎదురుచూస్తున్నాం’ అని బఘేల్ బదులిచ్చారు. ‘మీరు ఇంతవరకు వేదిక గురించి, సమయం, తేదీ గురించి ఎలాంటి సమాధానం ఇవ్వలేదు. కానీ ప్రజలు వేదిక సిద్ధం చేశారు. అమిత్ షాజీ.. డేట్, టైం చెప్పండి’ అంటూ సోఫా ఫొటోను ట్విటర్(ఎక్స్)లో షేర్ చేశారు. ఆ రెండు సీట్ల సోఫాపై ఒక పక్క అమిత్ షా పేరు, మరోపక్క బఘేల్ పేరు రాసి ఉంది. ఇదిలా ఉంటే.. చత్తీస్‌గఢ్‌లో మంగళవారం మొదటిదశ పోలింగ్ పూర్తయ్యింది. నవంబర్ 17న రెండో దశ ఓటింగ్ నిర్వహించనున్నారు. డిసెంబర్ 3న ఫలితాలు వెల్లడి కానున్నాయి.