ఇదే నిజం, ధర్మపురి టౌన్: జగిత్యాల జిల్లా ధర్మపురి మండలం 7వ బూత్ తీగల ధర్మారం గ్రామంలో ఓటు వేసేందుకు జనాలు బారులు తీరారు. ఎండ తీవ్రత ఎక్కువగా ఉండటంతో ఎన్నికల అధికారులు టెంట్ ఆరెంజ్ చేశారు. తెలంగాణలోని 17 లోక్సభ స్థానాలకు గాను 525 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు.. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరగనుంది. సమస్యాత్మక ప్రాంతాల్లో ముందుగానే పోలింగ్ పూర్తి కానుంది. అయితే సమయం ముగిసినా.. క్యూలో నిల్చున్న వాళ్లకు ఓటేసేందుకు అనుమతి ఇస్తారు.