Homeహైదరాబాద్latest Newsతెలంగాణ వాసులకు పండగే పండగ.. న్యూ ఇయర్, సంక్రాతి కానుకలు రెడీ..!

తెలంగాణ వాసులకు పండగే పండగ.. న్యూ ఇయర్, సంక్రాతి కానుకలు రెడీ..!

తెలంగాణ వాసులకు ప్రభుత్వం న్యూ ఇయర్, సంక్రాతి కానుకలు ఇచ్చేందుకు సిద్దమయ్యింది. దీని కోసం సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు అర్హులైన అన్నదాతలకు రైతు భరోసా డబ్బులు సంక్రాంతి పండుగకు అన్నదాతల అకౌంట్లలో జమ చేయాలని కేబినెట్ నిర్ణయించింది. అలాగే డిసెంబర్‌ 28న భూమిలేని నిరుపేదలకు మొదటి విడతగా రూ.6 వేలు ఇవ్వాలని కేబినెట్ నిర్ణయించింది. కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా.. డిసెంబర్ 28న నిరుపేద అకౌంట్లలోకి రూ.6 వేలు జమ చేయనున్నట్టు కేబినెట్ నిర్ణయిచింది. అలాగే.. సంక్రాంతి తర్వాత కొత్త రేషన్‌ కార్డులు జారీ చేసేందుకు.. మంత్రివర్గం నిర్ణయించింది.

Recent

- Advertisment -spot_img