Homeహైదరాబాద్latest Newsకొత్త రేషన్‌ కార్డుల కోసం రాష్ట్ర ప్రజలు ఎదురుచూపులు..!

కొత్త రేషన్‌ కార్డుల కోసం రాష్ట్ర ప్రజలు ఎదురుచూపులు..!

కొత్త రేషన్‌కార్డుల కోసం తెలంగాణ రాష్ట్రంలో లక్షల కుటుంబాలు ఎదురుచూస్తున్నాయి. కొత్త రేషన్‌కార్డుల జారీకి రాష్ట్ర ప్రభుత్వం మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటుచేసిన సంగతి తెలిసిందే. ఫ్యామిలీ డిజిటల్‌కార్డుల జారీ కొలిక్కివచ్చిన తర్వాత.. ఉన్న కార్డుల్లో కుటుంబ సభ్యుల పేర్లను చేర్చడం.. ఆ తర్వాత కొత్త రేషన్‌కార్డుల జారీ ప్రక్రియ చేపట్టనున్నట్లు సమాచారం. కొత్త రేషన్‌కార్డుల డిమాండ్‌ను అంచనా వేసేందుకు ‘ప్రజాపాలన’ కార్యక్రమంలో తెల్ల కాగితాలపై దరఖాస్తులను ఆహ్వానించారు. కొత్త రేషన్‌కార్డులు, ధరణి సమస్యల పరిష్కారం.. రెండింటికీ కలిపి దాదాపు 19.92 లక్షల దరఖాస్తులు వచ్చాయి.

Recent

- Advertisment -spot_img