Homeజిల్లా వార్తలుప్రజాపాలన కార్యక్రమానికి అనూహ్యంగా స్పందిస్తున్న ప్రజలు

ప్రజాపాలన కార్యక్రమానికి అనూహ్యంగా స్పందిస్తున్న ప్రజలు

అభయ హస్తం కార్యక్రమంలో పాల్గొన్న ప్రభుత్వ విప్ లక్ష్మణ్ కుమార్

ఇదేనిజం, ఎండపల్లి: జగిత్యాల జిల్లా ఎండపల్లి మండలం రాజరాంపల్లి గ్రామంలో శనివారం రోజున నిర్వహించిన ప్రజాపాలన కార్యక్రమంలో ప్రభుత్వ విప్, ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పాల్గొన్నారు. దరఖాస్తులను పరిశీలిస్తూ ప్రజలతో కాసేపు మాట్లాడారు. ఏదైనా సమస్యలు ఉంటే అధికారులకు విన్నవించుకోవాలని తెలిపారు. అనంతరం ఏర్పాటుచేసిన సభలో లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ… నూతన ప్రభుత్వం వచ్చిన వెంటనే ఇచ్చిన హామీ ప్రకారం 6 గ్యారంటీల పథకాలను అమలు చేయడంలో ప్రభుత్వం ముందస్తు చర్యలు తీసుకుంటుందని అన్నారు. కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శైలేందర్ రెడ్డి, వెల్గటూర్ సర్పంచ్ మురళి, మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు రమేష్, స్థానిక సర్పంచ్ గెల్లుచంద్రశేఖర్, ఎంపిటిసి గాజుల మల్లేశం, గాజుల విజయ్, రమేష్, శ్రీనివాస్, సంజీవ్, మహేష్, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.

Recent

- Advertisment -spot_img