Homeహైదరాబాద్latest Newsభారీ వర్షాలకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: కంగ్టి ఎస్సై విజయ్ కుమార్

భారీ వర్షాలకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: కంగ్టి ఎస్సై విజయ్ కుమార్

ఇదేనిజం, కంగ్టి: ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు మండల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కంగ్టి ఎస్సై విజయ్ కుమార్ అన్నారు. ఆదివారం కురుస్తున్న భారీ వర్షల ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… రానున్న రెండు రోజుల్లో భారీ నుండి అతి భారి వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసిన నేపథ్యంలో ప్రజలు అప్రమత్తం ఉండాలని అన్నారు. గ్రామాలలో తడిసిన విద్యుత్ స్తంభాలను ఎవరు ముట్టుకోవద్దని అన్నారు. గ్రామంలో ఉన్న పురాతనమైన ఇండ్లలో నివసిస్తున్న వారు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని సూచించారు. అత్యవసరమైతే తప్ప ప్రజలు ఎవరు బయటకు రావద్దని అన్నారు. గ్రామ ప్రజలు చెరువులు కుంటలు దగ్గర వెళ్ళొదు అన్నారు. మండలంలోని ఆయా గ్రామాలలో భారీ వర్షాల వల్ల ఎక్కడైనా ప్రజలకు వల్ల ఇబ్బంది ఉంటే వెంటనే పోలీస్ స్టేషన్ కు సమాచారం అందిచలని అన్నారు. కంగ్టి పోలీస్ స్టేషన్లో హెల్ప్ లైన్ నెంబర్ 8712656760 ఏర్పాటు చేశామని అన్నారు. హెల్ప్ లైన్ నెంబర్ కంగ్టి మండల ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని అన్నారు.

Recent

- Advertisment -spot_img