ఇదేనిజం,శేరిలింగంపల్లి: స్వచ్చదనం – పచ్చదనం కార్యక్రమంలో ప్రజలందరూ భాగస్వాములవ్వాలని శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్వచ్చదనం – పచ్చదనం కార్యక్రమంలో భాగంగా శేరిలింగంపల్లి డివిజన్ పరిధిలోని డోయెన్స్ కాలనీలో జోనల్ కమిషనర్ ఉపేందర్ రెడ్డి, డీసీ రజినీకాంత్ రెడ్డి, వైద్యాధికారి నగేష్ నాయక్ తో కలిసి ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గాంధీ మాట్లాడుతూ కాలనీల అసోసియేషన్ సభ్యులు, కాలనీవాసులు, సామాజికవేత్తలు అందరి భాగస్వామ్యంతో స్వచ్చకాలనీలుగా తీర్చిదిద్దుతామన్నారు. ఈ కార్యక్రమంలో అధికారులు యస్ ఈ శంకర్ నాయక్, ఈ ఈ శ్రీనివాస్, యూబీడీ డైరెక్టర్ అనిల్, మేనేజర్ విక్రమ్ చంద్ర , కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, కాలనీల అసోసియేషన్ సభ్యులు, కాలనీ వాసులు పాల్గొన్నారు.