ఇదే నిజం దేవరకొండ: రాష్ట్ర వ్యాప్తంగా గత రెండు మూడు రోజుల నుండి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల పట్ల ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని, అత్యవసరమైతే తప్ప బయటకు వెళ్లకూడదని, తడిసిన కరెంటు స్థంబాలకు దూరంగా ఉండాలని,పంట పొలాల్లో రైతులు విద్యుత్ పట్ల జాగ్రత్తగా ఉండాలని. రానున్న రెండు రోజుల్లో చెరువులు, కుంటలు నిండే అవకాశం ఉన్నందున ఇరిగేషన్ మరియు రెవెన్యూ అధికారులు అందుబాటులో ఉంటూ అప్రమత్తంగా ఉండాలని ఎమ్మెల్యే నేనావత్ బాలు నాయక్ ఆదేశించారు.