Sankranthi: సంక్రాంతి పండగ వేళ సిటీ నుండి ప్రజలు సొంత ఊళ్లకు పయనమయ్యారు. ఈ నేపథ్యంలో గత రెండు రోజులుగా హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిపై వాహనాల రద్దీ కొనసాగుతూనే ఉంది. అలాగే రద్దీ దృష్ట్యా ORR నుంచి ఘట్కేసర్, బీబీనగర్, భువనగిరి, వలిగొండ మీదుగా చిట్యాల వద్ద హైవేకు వాహనాలు పంపించేలా అధికారులు చర్యలు తీసుకున్నారు. ఇప్పటివరకు పంతంగి టోల్ ప్లాజా నుంచి లక్షా పది వేల వాహనాలు, కోర్లపహాడ్ టోల్ ప్లాజా నుంచి 65 వేల వాహనాలు, నార్కెట్పల్లి-అద్దంకి రహదారిపై గల మాడ్గులపల్లి టోల్ ప్లాజా నుంచి 30 వేల పైచిలుకు వాహనాలు వెళ్లాయని అంచనా వేశారు.
ALSO READ: Telangana Police: ఈ కాల్స్ కు స్పందించకండి.. తెలంగాణ పోలీస్ శాఖ హెచ్చరిక..!