Homeఆంధ్రప్రదేశ్Perni Nani : Everyone knows this Allulla Gillud పేర్ని నాని : ఈ...

Perni Nani : Everyone knows this Allulla Gillud పేర్ని నాని : ఈ అల్లుళ్ల గిల్లుడు అందరికీ తెలుసు

– మంత్రి హరీశ్ రావు​పై ఏపీ మాజీ మంత్రి పేర్ని నాని సెటైర్

ఇదే నిజం, ఏపీ బ్యూరో: చంద్రబాబు అరెస్ట్‌ను ఖండించిన మంత్రి హరీష్ వ్యాఖ్యలపై ఏపీ మాజీ మంత్రి, వైసీపీ నేత పేర్ని నాని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ అల్లుళ్ళ వల్ల మామలకు గిల్లుళ్ళు తప్పవు అంటూ సెటైర్ వేశారు. ఆదివారం ఆయన తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ ఆఫీసులో మాట్లాడుతూ.. తెలంగాణ సీఎం కేసీఆర్ కు హరీశ్ రావు అల్లుడు.. ఎన్టీఆర్ కు చంద్రబాబు అల్లుడు.. మామను చంద్రబాబు వెన్నుపోటు పొడిచాడు. హరీశ్ రావు కూడా ఇలాంటి ప్రయత్నమే చేస్తున్నాడు అని ఆరోపించారు. ఎన్టీఆర్‌కు బాబు చేసిందే కేసీఆర్‌కు హరీష్‌ చేస్తాడు. ఈ అల్లుళ్ల గిల్లుడు సంగతి అందరికీ తెలిసిందే అంటూ వ్యాఖ్యానించారు. కేసీఆర్ తెలివైన వ్యక్తి కాబట్టి.. అల్లుడి గిల్లుడికి సమాధానం ఇస్తాడు అని పేర్ని నాని తెలిపారు.

Recent

- Advertisment -spot_img