Homeహైదరాబాద్latest Newsపల్లె దవాఖాన మంజూరుకై వినతి పత్రం

పల్లె దవాఖాన మంజూరుకై వినతి పత్రం

ఇదేనిజం, రాయికల్: రాయికల్ మండలంలోని భూపతిపూర్ గ్రామానికి చెందిన విజేత స్పోర్ట్స్ యూత్ వెల్ఫేర్ అసోసియేషన్ వారు గ్రామంలో జనాభా 3500 పైగా జనాభా ఉందని , వృద్ధులు, రైతులు, కార్మికులు షుగర్,ఆస్తమా,బిపి వ్యాదులతో బాధపడుతున్నారని,సరైన రవాణా సౌకర్యాలు లేవు. వైద్యం కోసం దూర ప్రాంతాలకు వెళ్లడం ఇబ్బందికరంగా ఉందని అలాగే మా గ్రామానికి చుట్టుపక్కల గ్రామాల నుండి ప్రాథమిక పాఠశాలకి, హైస్కూల్ కి విద్యార్థిని విద్యార్థులు వస్తున్నారని వీరికి అనారోగ్య పరిస్థితులు ఏర్పడినప్పుడు చాలా ఇబ్బందులు తలెత్తుతున్నాయి. కావున పల్లె దవాఖాన ఏర్పాటు చేసినట్లయితే మా గ్రామ ప్రజలకు,విద్యార్థులకు మరింత సౌకర్యమైన వైద్య సేవలు అందుతాయని భూపతిపూర్ గ్రామానికి పల్లె దవాఖాన మంజూరు చేయాలని వడ్డే లింగాపూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్ర వైద్యాధికారి కస్తూరి సతీష్ కి వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో యూత్ అధ్యక్షులు సోమ రమేష్ రెడ్డి, మామిడాల నాగరాజు, గుండోజీ నరేష్,చిట్టెటి ప్రతాప్ రెడ్డి పాల్గొన్నారు.

Recent

- Advertisment -spot_img