Homeసినిమాకంగన రనౌత్ పై కోర్టులో పిటిషన్

కంగన రనౌత్ పై కోర్టులో పిటిషన్

Bollywood actress Kangana Ranaut, who has been the carafe address to controversy, has recently got into another entanglement.

Her tweets on the ongoing protests against agricultural laws are known to be controversial.

She has been widely criticized. A petition has also been filed in a Delhi court seeking registration of a case against her.

kangana ranaut 4 ఇదేనిజం కంగన రనౌత్ పై కోర్టులో పిటిషన్

వివాదాలకు కేరాఫ్ అడ్రస్ గా ఉండే బాలీవుడ్ నటి కంగన రనౌత్ తాజాగా మరో చిక్కులో పడ్డారు.

వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ జరుగుతున్న నిరసన కార్యక్రమాలపై ఆమె చేసిన ట్వీట్లు వివాదాస్పదమైన సంగతి తెలిసిందే.

kangana ranaut 3 ఇదేనిజం కంగన రనౌత్ పై కోర్టులో పిటిషన్

ఆమెపై పలువురు తీవ్ర విమర్శలు గుప్పించారు. ఆమెపై కేసు నమోదు చేయాలంటూ ఢిల్లీ కోర్టులో పిటిషన్ కూడా దాఖలైంది.

ఈ పిటిషన్ ను ఢిల్లీ సిక్కు గురుద్వారా మేనేజ్ మెంట్ కమిటీ ప్రెసిడెంట్ మణీందర్ సింగ్ సిర్సా దాఖలు చేశారు.

kangana ranaut 2 ఇదేనిజం కంగన రనౌత్ పై కోర్టులో పిటిషన్

నిరసనల్లో పాల్గొంటున్న రైతులతో పాటు, సిక్కు సామాజికవర్గాన్ని కించపరిచేలా కంగన వ్యాఖ్యలు చేశారని పిటిషన్ లో ఆరోపించారు.

కంగనపై ఫిర్యాదు చేసినప్పటికీ పోలీసులు పట్టించుకోలేదని తెలిపారు. ఎఫ్ఐఆర్ నమోదు చేసేందుకు తిరస్కరించారని చెప్పారు.

kangana ranaut 2 ఇదేనిజం కంగన రనౌత్ పై కోర్టులో పిటిషన్

అందువల్లే తాము కోర్టును ఆశ్రయించాల్సి వచ్చిందని తెలిపారు. కంగన ట్వీట్లు దేశ ఐక్యత, సమగ్రతను దెబ్బతీసేలా ఉన్నాయని చెప్పారు.

మత ఘర్షణకు దారితీసేలా ఉన్నాయని అన్నారు.

kangana ranaut 1 ఇదేనిజం కంగన రనౌత్ పై కోర్టులో పిటిషన్

ఈ పిటిషన్ ను విచారించిన మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టు… దీనిపై నివేదిక సమర్పించాల్సిందిగా ఢిల్లీ పోలీసులను ఆదేశించింది.

యాక్షన్ టేకెన్ రిపోర్టు (ఏటీఆర్)ను ఏప్రిల్ 24లోగా అందజేయాలని ఆదేశించింది.

Recent

- Advertisment -spot_img