తెలంగాణలో తాజాగా జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచిన కడియం శ్రీహరి, తెల్లం వెంకటరావు ఇటీవల కాంగ్రెస్ పార్టీలో చేరిన సంగతి తెలిసిందే. బీఆర్‌ఎస్ గెలిచి కాంగ్రెస్‌లో చేరిన ఇద్దరిపై అనర్హత వేటు వేయాలని ఎమ్మెల్యే వివేకానంద హైకోర్టులో పిటిషన్ వేశారు. వారిద్దరిపై చర్యలు తీసుకునేలా స్పీకర్‌ను ఆదేశించాలని ఆయన పిటిషన్‌లో కోరారు. ఈ పిటిషన్ పై నేడు హైకోర్టులో విచారణ జరగనున్నట్లు తెలుస్తోంది.