Homeహైదరాబాద్latest Newsహుస్సేన్‌ సాగర్‌లో నిమ‌జ్జ‌నం చేయొద్ద‌ని హైకోర్టులో పిటిష‌న్‌

హుస్సేన్‌ సాగర్‌లో నిమ‌జ్జ‌నం చేయొద్ద‌ని హైకోర్టులో పిటిష‌న్‌

హుస్సేన్‌ సాగర్‌లో నిమ‌జ్జ‌నం చేయొద్ద‌ని హైకోర్టులో ఓ పిటిష‌న‌ర్‌ పిటిష‌న్ వేశారు. హుస్సేన్‌ సాగర్‌లో నిమజ్జనం చేయవద్దని గతంలో ఇచ్చిన హైకోర్టు ఆదేశాలు అమలు చేయాలని పిటిషనర్ త‌న పిటిష‌న్‌లో పేర్కొన్నారు. హైడ్రాను కూడా ప్రతిపాదిగా చేర్చాలని పిటిషనర్ డిమాండ్ చేశారు. హుస్సేన్‌ సాగర్‌ పరిరక్షణ హైడ్రా బాధ్యత కాబట్టి ప్రతివాదిగా చేర్చాలని కోరారు. పిటిషన్ ను మరో బెంచ్ కు బదిలీ చేసిన‌ట్లు చీఫ్ జస్టిస్ బెంచ్ తెలిపింది. రేపు జస్టిస్ వినోద్ కుమార్ బెంచ్ ఈ పిటిష‌న్‌పై విచార‌ణ చేయ‌నుంది.

spot_img

Recent

- Advertisment -spot_img