ఇదే నిజం, హైదరాబాద్: మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఎన్నికల నామినేషన్‌పై అభ్యంతరం వ్యక్తం చేస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. రాఘవేంద్ర రాజు అనే వ్యక్తి శుక్రవారం హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేశారు. శ్రీనివాస్ గౌడ్ వేసిన నామినేషన్‌పై ఇటీవల అభ్యంతరం వ్యక్తం చేసిన ఎన్నికల రిటర్నింగ్ అధికారి పట్టించుకోవడం లేదని పిటిషన్లో పేర్కొన్నారు. శ్రీనివాస్ గౌడ్ వేసిన అఫిడవిట్, నామినేషన్లో వాస్తవాలు తొక్కిపెట్టారని, ఆయన భార్య వృత్తికి సంబంధించిన వివరాలను అందులో వెల్లడించలేదని రాఘవేంద్ర రాజు పిటిషన్లో పేర్కొన్నారు. శ్రీనివాస్ గౌడ్ నామినేషన్‌ను రద్దు చేయాలని కోరారు. పిటిషన్‌పై విచారించిన హైకోర్టు.. పిటిషనర్ అభ్యంతరాలను చూడాలని ఎన్నికల రిటర్నింగ్ అధికారికి ఆదేశాలు జారీ చేసింది.