Homeహైదరాబాద్latest Newsకారోబార్ల సమస్యలు పరిష్కరించాలని ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ కు వినతి పత్రం

కారోబార్ల సమస్యలు పరిష్కరించాలని ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ కు వినతి పత్రం

ఇదే నిజం, ధర్మపురి టౌన్: జగిత్యాల జిల్లా ధర్మపురి నియోజకవర్గ కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఈ రోజు ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ని కారోబార్ లు మరియు గ్రామ పంచాయతీ సిబ్బంది కలవడం జరిగింది. కారోబార్ లు మరియు గ్రామ పంచాయతీ సిబ్బంది గురించి 51 GO రద్దు మరియు మల్టీ పర్పస్ విధానాన్ని రద్దు గురించి కేటగిరి ల వారీగా గుర్తించి కనీసం 19500 జీతం ఇచ్చి తమకు ఆరోగ్య భద్రత కల్పించాలని కోరుకుంటు గత ప్రభుత్వం అన్యాయం చేసింది. కావున ఇప్పుడున్న ప్రజా ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాకు న్యాయం చేయాలని కోరుతూ వినతి పత్రం ఇవ్వడం జరిగింది. దీనికి స్పందించిన ప్రభుత్వ విప్ లక్ష్మణ్ కుమార్ వెంటనే ముఖ్యమంత్రి తో మరియు దీనికి సంబంధించిన అధికారులతో మాట్లాడి ఈ సమస్యను పరిష్కరిస్తామని చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమానికి ధర్మపురి కారోబార్ యూనియన్గౌరవ అధ్యక్షులు కట్ట గంగారాం, అధ్యక్షులు దుంపేట రమేష్, ఉప అధ్యక్షులు సంబేట రాము, ప్రధాన కార్యదర్శి గొల్లపల్లి రంజిత్ కోశాధికారి అల్లూరి అంజయ్య, సలహాదారు కొండ నారాయణ మరియు కార్యవర్గ సభ్యులు హాజరయ్యారు.

Recent

- Advertisment -spot_img