Homeహైదరాబాద్latest Newsగొల్లపల్లి మండల కేంద్రంలో ఎస్సీ కాలనీ వైకుంఠధామ నిర్మాణం చేయాలని స్థానిక తహసిల్దార్ కి వినతి...

గొల్లపల్లి మండల కేంద్రంలో ఎస్సీ కాలనీ వైకుంఠధామ నిర్మాణం చేయాలని స్థానిక తహసిల్దార్ కి వినతి పత్రం

  • మండల దళిత మోర్చా మండల అధ్యక్షులు చెవులమద్ది శేఖర్

ఇదే నిజం,గొల్లపల్లి: జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండల కేంద్రంలో ఎస్సీ కాలనీ వైకుంఠధామ నిర్మాణం చేయాలని స్థానిక తహసిల్దార్ కి గొల్లపల్లి మండల దళిత మోర్చా మండల అధ్యక్షులు చెవులమద్ది శేఖర్ ఆధ్వర్యంలో వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో బిజెపి మండల అధ్యక్షులు కట్ట మహేష్ మాట్లాడుతూ దళితులు మండల కేంద్రంలో జనాభాపరంగా అధిక సంఖ్యలో ఉన్నారు కానీ వారిలో చాలామంది భూమిలేని నిరుపేదలు కనీసం ఇంట్లో ఎవరైనా చనిపోతే పూడ్చడానికి,కాల్చడానికి కూడా స్థలం లేక చాలా మంది కాలని వాసులు ఇబ్బందులు పడుతున్నారు.అంతేకాకుండా దళితులు అనే వివక్షతో ఇతరుల భూములలో దహన సంస్కరణలు చేయడానికి ఎవరు ఒప్పుకోవడం లేదని ఆవేదన వ్యక్తంచేశారు.ఇట్టి విషయమై అధికారుల వెంటనే స్పందించి చర్యలు తీసుకొని ప్రజలకు సౌకర్యం కోసం వైకుంఠధామం పనులు వెంటనే ప్రారంభించాలని కోరడం జరిగింది.ఈ కార్యక్రమంలో బిజెపి ఐటీ సెల్ కన్వీనర్ చెవులమద్ది రాజు,బీజేవైఎం టౌన్ ప్రెసిడెంట్ సంగం కళ్యాణ్,ఎస్టీ మోర్చా మండల అధ్యక్షుడు మానుపాటి రమేష్,ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు.

Recent

- Advertisment -spot_img