ఇదేనిజం, రాయికల్: జగిత్యాల పట్టణ కేంద్రంలోని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి నివాసంలో తెలంగాణ రాష్ట్రంలో 61 ఏళ్లు పైబడిన 3797 మంది V R A ల స్థానంలో దశాబ్ద కాలంగా విధులు నిర్వహిస్తున్న వారి అర్హతకు అగునంగా జూనియర్ అసిస్టెంట్ రికార్డ్ అసిస్టెంట్ ఆఫీస్ సబార్డినేట్ లుగా నియమించి రెగ్యులర్ స్కేల్ అందించేందుకు తగు చర్యలు తీసుకునేలా చూడాలని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి కి వినతి పత్రం అందజేశారు.
ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి స్పందించి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి లేక ద్వారా తెలంగాణ రాష్ట్రంలోని రెవెన్యూ డిపార్ట్మెంట్లో పై స్థాయి అధికారుల నుండి కిందిస్థాయి అధికారి వరకు అందరికీ అందుబాటులో ఉండి సేవలందించడంతోపాటు ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు పంట నష్టం అంచనా వేసేందుకు అధికారులకు తోడుగా నిలబడడమే కాకుండా గ్రామాల్లో నిర్వహించే ప్రభుత్వ కార్యక్రమాల్లో పాలుపంచుకుంటూ కార్యక్రమాలు అమలు చేయడంలో క్షేత్ర సాయి సమస్యలను సర్వే అధికారులకు సహకారం అందించే వంటి కార్యక్రమాలతో పాటు పనిచేశారని చెప్పగా తప్పదని ప్రతాప్ ప్రభుత్వం రెవెన్యూ వ్యవస్థ ప్రక్షాళన పేరిట ధరణి ఏర్పాటు చేయడంతో వీఆర్వో వీఆర్ఏల వ్యవస్థ రద్దుతో ఏర్పడే సమస్యలపై ప్రత్యేకంగా ఇటువంటి అధ్యయనం చేపట్టకుండా దశాబ్దాలు తరబడి వీఆర్ఏలుగా విధులు నిర్వహిస్తున్న వారి సమస్యలను పట్టించుకోకుండా ఏకపక్షంగా వీఆర్వో వీఆర్ఏల వ్యవస్థను గత ప్రభుత్వం రద్దు చేసిందని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి లేఖలో పేర్కొన్నారు.
తెలంగాణ రాష్ట్రంలోని 20,555 మంది V.R.A. లు ఉండగా, గత ప్రభుత్వం పీఆర్పీ వ్యవస్థను రద్దు చేసి, 16,788 మంది VRA లను వారి అర్హతకు అనుగుణంగా వివిధ ప్రభుత్వ విభాగాల్లో Junior Assitant Record Asmitam, Office Subordinate లుగా నియమించి, Regular Scale అందించాలని GO.M.S.No. 81లో స్పష్టం పేర్కొనగా, ఆ మేరకు నియామకాలు సైతం పూర్తిగావించబడ్డాయి. 61 ఏళ్లకుపైబడి విధులు నిర్వహిస్తున్న V.R.A. లకు 2011 జనవరి 10కి పూర్వం V.R.A. లుగా నియమింపబడి విధులు నిర్వహిస్తున్న వారికి పదవి విరమణ వయస్సు నిర్ధారణ కానప్పటికి, రాష్ట్రవ్యాప్తంగా 61ఏళ్ల వయసు పైబడిన 3,797 మంది V.R.A. ల స్థానంలో వారి వారసులు నేటికి Revenue Department లో విధులు నిర్వహిస్తున్నారు. GO.MS.No.85 ప్రకారం 61ఏళ్లపైబడిన V.R.A. ల స్థానంలో వారసులుగా విధులు నిర్వహిస్తున్న వారి నియామకంపై గత ప్రభుత్వం జీఓ సైతం జారీ చేసినప్పటికి అమలు చేయకపోవడంతో V.R.A.ల వారసులు మానసికంగా కుంగిపోతూ, వివిధ రకాల వ్యాధుల బారినపడి ఇప్పటికే 17 మంది V.R.A.లు మృతిచెందారు. వారసులుగా V.R.A. విధులు నిర్వహిస్తున్న వారిని Regular చేస్తారనే ఆశతో తమ నియామకాల కోసం సుమారు దశాబ్దకాలంగా ఎదురుచూస్తున్నారు.
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వారసుల స్థానంలో V.R.A.లుగా విధులు నిర్వహిస్తున్న 3,797 నుంది 61 సంవత్సరాల పైబడిన V.R.A. వారసులకు వారి అర్హతకు అనుగుణంగా వివిధ ప్రభుత్వ విభాగాల్లో Junior Assitam, Record Assitant, Office Subordinate లుగా నియమించి, రెగ్యులర్ స్కేలు అందించాలని GO.MS.No. 86లో స్పష్టంగా పేర్కొన్న నేపథ్యంలో నియామకాలు చేపట్టేందుకు తగు చర్యలు చేపట్టగలరని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి లేఖలో పేర్కొన్నారు.