Homeహైదరాబాద్latest Newsఎమ్మార్వో కు బీజేపీ నాయకుల వినతిపత్రం..ఎందుకంటే..?

ఎమ్మార్వో కు బీజేపీ నాయకుల వినతిపత్రం..ఎందుకంటే..?

ఇదే నిజం, ధర్మపురి టౌన్: జగిత్యాల జిల్లా, ధర్మపురి పట్టణంలో భారతీయ జనతా పార్టీ ఎస్సీ మోర్చా రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు ఈరోజు దళిత మోర్చా జగిత్యాల జిల్లా ప్రధాన కార్యదర్శి దొనకొండ నరేష్ ఆధ్వర్యంలో వినతి పత్రం అందించడం జరిగినది. ఈ సందర్భంగా దొనకొండ నరేష్ మాట్లాడుతూ.. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ దళితులకు ఇచ్చినటువంటి హామీలను వెంటనే అమలు పరచాలని డిమాండ్ చేస్తూ ఎస్సీ కార్పొరేషన్ నిధులను వెంటనే విడుదల చేయాలని వాటితో పాటు దళితులకు ప్రతి కుటుంబానికి ఇంటి నిర్మాణానికి అందిస్తామన్న 5 లక్షల రూపాయలను వెంటనే అందించాలని డిమాండ్ చేస్తూ, అంబేద్కర్ అభయాస్తం పేరుతో ప్రవేశపెట్టిన వంటి స్కీం ద్వారా 12 లక్షల రూపాయలను కూడా వెంటనే ప్రతి కుటుంబానికి అందించాలని ఎస్సీ హాస్టల్స్ ను పునః ప్రారంభం చేయాలని డిమాండ్ చేస్తూ, బ్యాక్లాగ్ ఉద్యోగాలను కూడా వెంటనే అందించాలని ఈ రోజు ధర్మపురి తాసిల్దార్ కృష్ణ చైతన్యకు వినతిపత్రం అందించడం జరిగినది. లేని పక్షంలో భారతీయ జనతా పార్టీ ఎస్సీ మోర్చా ఆధ్వర్యంలో ఉద్యమాన్ని లేపి మిమ్ములను గద్ద దించే దిశగా పనిచేస్తామని భారతీయ జనతా పార్టీ ఎస్సీ మోర్చా పక్షాన హెచ్చరిస్తున్నాము అన్నారు. ఈ కార్యక్రమంలో అసెంబ్లీ కో-కన్వీనర్ బండారి లక్ష్మణ్, పట్టణ అధ్యక్షుడు బేజారపు లవన్ యు, మోర్చా అధ్యక్షుడు గాజుభాస్కర్, మండల పట్టణ ప్రధాన కార్యదర్శులు కుమ్మరి తిరుపతి, తిరుమందా సత్యనారాయణ, సీనియర్ నాయకులు నల్మాస్ వైకుంఠం, పోతంశెట్టి శేఖర్, మైదా మల్లేశం, మండలూజు సూరజ్, కొంపల నరసయ్య, పిల్లి శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.

Recent

- Advertisment -spot_img