Homeహైదరాబాద్latest Newsప్రైవేట్‌ పాఠశాలల దోపిడీ పై ఎంఈఓ కు వినతిపత్రం

ప్రైవేట్‌ పాఠశాలల దోపిడీ పై ఎంఈఓ కు వినతిపత్రం

ఇదే నిజం, ముస్తాబాద్: ముస్తాబాద్ మండల కేంద్రంలోని ప్రైవేట్ పాఠశాలల్లో పాఠ్యపుస్తకాలు, బెల్ట్ లు, డ్రెస్సులు అడ్డగోలుగా అధిక రేట్లతో అమ్ముతున్నారు. అలాగే అధిక ఫీజులు కూడా వసూలు చేస్తున్నారని కాంగ్రెస్ పార్టీ విద్యార్థి నాయకుడు సారుగు రాకేష్ మండల వనరుల కేంద్రంలో ఎంఈఓ సిబ్బందికి వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రైవేట్ పాఠశాలలో నోటీస్ బోర్డ్ లో తరగతుల ఫీజు వివరాలు తెలపాలని, అలాగే పాఠ్యపుస్తకాలు, బెల్ట్ లు, డ్రెస్సులు, అడ్డగోలుగా ఫీజులు వసూలు చేసే పాఠశాల పై చర్యలు తీసుకోవాలని ఎంఈఓ ను కోరారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ విద్యార్థి నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

Recent

- Advertisment -spot_img