ఇదే నిజం, ధర్మపురి టౌన్: జగిత్యాల జిల్లా, ధర్మపురి పట్టణంలో ఈ రోజు రాష్ట్ర శాఖ బీజేపీ ఓబీసీ మోర్చా పిలుపు మేరకు వినతి పత్రం సమర్పించడం జరిగింది. ఈ సందర్భంగా జగిత్యాల జిల్లా బిజెపి ఓ మోర్చా జిల్లా కార్యదర్శి ఆకుల శ్రీనివాస్ మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కామారెడ్డి ఎన్నికల సభలో బీసీ డిక్లరేషన్ అమలు చేస్తానని హామీ ఇవ్వడం జరిగింది. కానీ ఇప్పటివరకు ఎలాంటి ఆచరణకు నోచుకోలేదు. ఈ సందర్భంగా బీజేపీ ఓబీసీ మోర్చా కింది డిమాండ్లను చేస్తున్నాము. ప్రభుత్వం బీసీ కమిషన్ నివేదిక ఆధారంగా కులగలను చేయాలని స్థానిక సంస్థ ఎన్నికల్లో బీసీలకు 23 శాతం ఉన్న దాన్ని 42 కు పెంచాలని అన్ని బీసీ కులాలకు కార్పొరేషన్లు ఏర్పాటు చేయాలని ర్యాంకులతో సంబంధం లేకుండా ప్రతి బీసీ విద్యార్థులకు ఫీజు రీయంబర్స్మెంట్ ఇవ్వాలని బీసీ కార్పొరేషన్ ద్వారా ఉన్నత విద్య కొరకు చిరు వ్యాపారుల కొరకు నిధులు ఎలాంటి పూచీకత్తు లేకుండా ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు లవన్, అసెంబ్లీ కో కన్వీనర్ బండారి లక్ష్మణ్, దొనకొండ నరేష్, కుమ్మరి తిరుపతి, తిరుమందాసు సత్యనారాయణ, అప్పం శ్రీనివాస్, తోట శ్రీనివాస్, శివ సాయి, నరేడ్ల శంకర్, సాత్విక్ తదితరులు పాల్గొన్నారు.