ఇదే నిజం, ధర్మపురి టౌన్: జగిత్యాల జిల్లా, ధర్మపురి పట్టణంలోని ముదిరాజ్ కులస్తులు తెనుగు గద్దె నుండి బైక్ ర్యాలీగా వచ్చి ముది రాజ్ లను బీసీ డీ నుండి బీసీ ఏకు మార్చాలని కోరుతూ ఎమ్మార్వో కృష్ణ చైతన్యకు వినతి పత్రం అందజేశారు. ముదిరాజ్ కుల బాంధవులు జిల్లా అధ్యక్షుడు నీలం పెద్దలు జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ ధర్మపురి మండలాధ్యక్షుడుజెట్టి రాజన్న ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. జిల్లా అధ్యక్షులు మాట్లాడుతూ.. ఎలక్షన్ లో అభయ హస్తంలో మీరు ఇచ్చిన హామీని నెరవేర్చాలని కోరారు. ఈ కార్యక్రమంలో బిల్ల పోచయ్య, వీర వేణి రాజమల్లయ్య ,వీర వేణి లక్ష్మయ్య ,జెట్టి నాగేష్, జెట్టి మహేష్ ,పోలా వేణి రాజన్న, కొండవేని పెద్దలు, వీర వేణి వెంకన్న, కొండవీని శంకర్, పెనుగొండ లచ్చన్న, వీర వేణి వెంకటేష్, బుచ్చన్న తదితరులు పాల్గొన్నారు.