ఇదేనిజం, ధర్మపురి టౌన్: జగిత్యాల జిల్లా ధర్మపురి పట్టణంలో వీధి కుక్కల వలన అలాగే ఆవుల వలన కోతుల వలన మన ధర్మపురి పట్టణ ప్రజలకు జరుగుతున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని ఈ రోజు భారతీయ యువ మోర్చా అధ్యక్షులు గాజు భాస్కర్ ఆధ్వర్యంలో స్థానిక మున్సిపల్ కమిషనర్ కి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా గాజుభాస్కర్ మాట్లాడుతూ ధర్మపురి లోని పట్టణ ప్రజలకు అలాగే స్కూల్ కి పోయే పిల్లలకు,పెద్దలకు ప్రతి ఒక్కరి ఈ వీధి కుక్కల వలన చాలా ఇబ్బందులకు గురవుతున్నారు.
అలాగే ఆవుల వలన ధర్మపురికి వచ్చే యాత్రికులకు కానీ ధర్మపురి లో మార్కెట్లో కూరగాయలు అమ్మే వారికి, ధర్మాపురి పట్టణ ప్రజలకు చాలా ఇబ్బందులకు గురవుతున్నారు. ఈ ఆవులు ఇష్టానుసారంగా రోడ్లమీద తిరగడం వలన ప్రమాదాలు కూడా జరుగుతున్నాయి. మేము గతంలో ఎన్నోసార్లు మున్సిపల్ కమిషనర్ కి వినతి పత్రాలు కూడా ఇవ్వడం జరిగింది. దీనిపైన కూడా ఎలాంటి చర్యలు తీసుకోలేదు.
అలాగే కోతుల వలన కూడా చాలా ఇబ్బందులకు గురవుతున్నారు. ప్రతి వాడలో ప్రతి ఇంటిలో ఈ కోతుల సమస్య చాలా ఉంది. ఈ కోతుల వలన గతంలో ఒకరు చనిపోయిన విషయం కూడా అందరికీ తెలిసిందే. ఇప్పటికీ దాడులు చేస్తూనే ఉన్నాయి. దీనిపైన కూడా మేము గత ప్రభుత్వంలో ఇప్పుడున్న ప్రభుత్వంలో కూడా ఎన్నోసార్లు వినతి పత్రాలు ఇచ్చిన కూడా చర్యలు తీసుకోకపోవడం చాలా బాధ కరం. మేము మా భారతీయ జనతా పార్టీ ధర్మాపురి ప్రజలను దృష్టిలో ఉంచుకొని వీటి పైన మున్సిపల్ వారు ఏ చర్య తీసుకున్న కూడా మేము దానికి సహకరిస్తాము.
ధర్మపురి పట్టణ ప్రజలకు ఈ కుక్కలు, ఆవులు ,కోతుల వలన సమస్య రాకుండా చూడాలని కోరడం జరిగింది. ఈ కార్యక్రమంలో బీజేపీ పట్టణ అధ్యక్షులు బెజ్జారపు లవన్ ,ప్రధాన కార్యదర్శి మండలోజి సూరజ్, బండారి సత్యనారాయణ, బీజేవైఎం జిల్లా సోషల్ మీడియా కన్వీనర్ దీవిటీ శ్రీధర్, యువ మోర్చా నాయకులు సంఘీ రాజేష్, కాశెట్టి శివ సాయి, ఆనందస్ నవీన్, నూనె వంశీ, తోట రిషి, మల్లంపల్లి వంశీ, బాణాల చందు, మరియు తదితరులు పాల్గొన్నారు.