Homeజిల్లా వార్తలుప్రభుత్వ భూమిలో అక్రమ కట్టడాలపై తహసీల్దార్ కి వినతి పత్రం

ప్రభుత్వ భూమిలో అక్రమ కట్టడాలపై తహసీల్దార్ కి వినతి పత్రం

ఇదే నిజం, గొల్లపల్లి : జగిత్యాల జిల్లా గొల్లపెల్లి మండలం మండలం మల్లన్న పేట గ్రామంలోని 534 సర్వే నెంబర్ గల భూమిలో కొంతమంది ముస్లింలు అక్రమంగా ఇళ్ల నిర్మాణాలు ఏర్పాటు చేసుకొని అక్కడున్న ప్రభుత్వ భూమిని ఆక్రమిస్తు మసీదు నిర్మాణాన్ని చేపడుతున్నారు ఎలాంటి అనుమతులు లేకుండా నిర్మిస్తున్నటువంటి కట్టడన్ని తొలగించాలని విశ్వహిందూ పరిషత్,బజరంగ్ దళ్ మండల శాఖ ఆధ్వర్యంలో తహసీల్దార్ కి వినతి పత్రం అందజేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో జిల్లా గోరక్ష ప్రముఖ ఆడెపు నరేష్,విశ్వహిందు పరిషత్ మండల అధ్యక్షులు కుంభాకర్ అరుణ్,బజరంగ్ దళ్ మండల కన్వీనర్ ఎనగందుల రమేష్,జంగిలి సత్యం,దడిగోపుల అశోక్,ముత్యాల స్వామి,బండారి నరేష్,తదితరులు పాల్గొన్నారు.

Recent

- Advertisment -spot_img