HomeజాతీయంPetrol and Gas Price : మళ్లీ పెరిగిన పెట్రో.. వంట గ్యాస్‌ ధరలు

Petrol and Gas Price : మళ్లీ పెరిగిన పెట్రో.. వంట గ్యాస్‌ ధరలు

Petrol and Gas Price hike again : మళ్లీ పెరిగిన పెట్రో.. వంట గ్యాస్‌ ధరలు… వినియోగదారులకు మరోసారి షాక్‌ ఇచ్చాయి చమురు, గ్యాస్‌ కంపెనీలు.

దేశంలో మరోసారి పెట్రోల్‌, డీజిల్ ధరలతో పాటు వంట గ్యాస్‌ ధరలు భారీగా పెరిగాయి.

లీటర్‌ పెట్రోల్‌పై 31 పైసలు, లీటర్ డీజిల్‌పై 38 పైసలు పెరిగింది.

దీంతో.. పలు రాష్ట్రాల్లో పెట్రోల్‌ ధర సెంచరీని క్రాస్‌ చేసి, నూట పది రూపాయలకు చేరువలో పరుగులు పెడుతోంది.

దీంతో దేశంలోని ప్రధాన నగరాల్లో పెట్రో ధరలు ఆకాశాన్నంటుతున్నాయి.

తెలుగు రాష్ట్రాల్లో పెట్రోల్ ధరలు అమాంతం పెరిగిపోయాయి.

హైదరాబాద్‌లో లీటర్‌ పెట్రోల్ ధర నూట ఏడు రూపాయల 8 పైసలకు పెరగగా.. లీటర్‌ డీజిల్ ధర 99 రూపాయల 75 పైసలకు చేరింది.

విజయవాడలో లీటర్‌ పెట్రోల్ ధర నూట తొమ్మిది రూపాయల 26 పైసలు కాగా.. డీజిల్ ధర నూటొక్క రూపాయి 28 పైసలకు పెరిగింది.

విశాఖలో లీటర్‌ పెట్రోల్ ధర నూట ఏడు రూపాయల 94 పైసలు ఉండగా.. లీటర్ డీజిల్ ధర వందకు చేరింది.

దేశ రాజధాని ఢిల్లీలో లీటర్ పెట్రోల్​ధర నూట రెండు రూపాయల 64 పైసలు, ముంబైలో లీటర్‌ పెట్రోల్ ధర నూట ఎనిమిది రూపాయల 67 పైసలు, చెన్నైలో లీటర్‌ పెట్రోల్ ధర వంద రూపాయల 23 పైసలు, బెంగళూరులో లీటర్‌ పెట్రోల్ ధర నూట ఐదు రూపాయల 95 పైసలకు పెరిగింది.

దేశవ్యాప్తంగా మరోసారి గ్యాస్‌ సిలిండర్‌ ధరలు కూడా పెరిగాయి.

వంట గ్యాస్‌ సిలిండర్‌పై 15 రూపాయలు పెరిగింది. దీంతో.. హైదరాబాద్‌లో గ్యాస్‌ సిలిండర్‌ ధర 952కు పెరిగింది. ఢిల్లీలో దాదాపు 900గా ఉంది.

Recent

- Advertisment -spot_img