భారత ప్రధాని నరేంద్ర మోదీని చంపేస్తామని గుర్తు తెలియని వ్యక్తి బెదిరింపులకు దిగాడు. తమిళనాడు చెన్నైలోని పురశైవాకంలో ఉన్న నేషనల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ(ఎన్ఐఏ) కంట్రోల్ రూమ్‌కు ఫోన్ చేసి ప్రధాని మోదీని హతమారుస్తానని బెదిరించాడు. ఈ నేపథ్యంలో ఎన్ఐఏ అధికారులు అప్రమత్తమయ్యారు. వెంటనే చెన్నై పోలీసులకు సమాచారం అందించారు. గుర్తు తెలియని వ్యక్తి ఫోన్ చేసిన నంబర్‌ను పోలీసులకు ఇచ్చారు. ఈ ఘటనపై చెన్నై సైబర్ క్రైమ్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.