ఫోన్‌పే డిజిటల్ పేమెంట్స్ యాప్ లంకాపే తో చేతులు కలిపింది. ఇక ఇండియా నుంచి శ్రీలంక వెళ్లే పర్యాటకులు, వ్యాపారస్థులు క్యాష్ క్యారీ చేయాల్సిన అవసరం లేదు. ఇండియన్స్‌కు పేమెంట్స్ విషయంలో మంచి అనుభవాన్ని ఇవ్వడానికి ఇది కీలకమని లంకాపే సీఈఓ చన్నా డిసిల్వా పేర్కొన్నారు. కాగా ఇప్పటికే ఫోన్‌పే సేవలు సింగపూర్, నేపాల్ వంటి దేశాల్లో అమలవుతున్నాయి.