నితీష్ తివారీ దర్శకత్వంలో రణబీర్ కపూర్ రాముడిగా, సాయి పల్లవి సీతగా నటిస్తున్న ‘రామాయణం’ చిత్రానికి సంబంధించి కొన్ని ఫోటోలు లీక్ అయినట్లు తెలుస్తోంది. ఈ లీక్ ఫోటోల్లో రామ్‌గా రణబీర్, సీతగా సాయి పల్లవి కనిపిస్తున్నారు. అయోధ్య యువ రాజుగా సాంప్రదాయ దుస్తులు ధరించిన రణ్‌బీర్, యువరాణి లుక్‌లో సీతగా సాయి పల్లవి ఉన్న ఫొటోలు రామాయణ సెట్స్ నుంచి లీకయ్యాయి. ఇవి వైరల్ గా మారడంతో వీరిద్దరూ సీతారామ్ గా బాగా సెట్ అయ్యారని నెటిజన్లు వ్యాఖ్యానిస్తున్నారు. ఈ సినిమాలో కెజిఎఫ్ హీరో యష్ రావణుడిగా, సన్నీ డియోల్ హనుమంతుడిగా కనిపించనున్నారు.