Homeతెలంగాణమందకృష్ణకు ప్రత్యామ్నాయం నేనే….

మందకృష్ణకు ప్రత్యామ్నాయం నేనే….

ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు న్యాయం చేస్తా….
: ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ పిడమర్తి రవి

తెలంగాణలో 2023 లో టీఆర్ఏస్, కేసీయార్ కు తానే ప్రత్యర్ధినని పేర్కొన్న మంద కృష్ణమాదిగ వ్యాఖ్యలను తాము ఖండిస్తున్నామని, తెలంగాణలో మహాజన సమాజ్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మంద కృష్ణమాదిగకు ప్రత్యామ్నాయం నేనేనని డాక్టర్ పిడమర్తి రవి ప్రకటించారు. ఈ మేరకు ఆయన శుక్రవారం ఓ ప్రకటన విడుదల చేశారు. ఎన్నికల సమయంలో పార్టీలు పెట్టి తర్వాత కనుమరుగు అవ్వడం ఈ మధ్య పారిపాటి అయ్యిందని, 2024 లో ఎన్నికలు ఉంటే ఇప్పుడే రాజ్యాధికారం, ఓట్లు అని మంద కృష్ణ పేర్కొనడం అనుమానంగా ఉందన్నారు. వర్గీకరణ ఉద్యమానికి మందకృష్ణ స్వస్తి చెప్పారని పిడమర్తి జోస్యం చెప్పారు. కాన్షీరం బాటలో తాను కులాలను అన్నిటినీ కలిపి, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలకు న్యాయం చేసేలా కృషి చేస్తానని ఆయన పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం వెంటనే ఎస్సీ వర్గీకరణ చేసి, బిసిలకు 50 శాతం, మైనార్టీలకు 12 శాతం, గిరిజనులకు 12 శాతం రిజర్వేషన్లు కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు.

RELATED ARTICLES

Recent

- Advertisment -spot_img