ఇదే నిజం, ముస్తాబాద్: ముస్తాబాద్ మండల పరిషత్ కార్యాలయంలో మండల వైద్యాధికారి డాక్టర్ గీతాంజలి ఆధ్వర్యంలో నులిపురుగుల నిర్మూలన వానకాలంలో సీజనల్ వ్యాధులు వ్యాప్తి చెందకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఏఎన్ఎంలకు అంగన్వాడీ టీచర్లు ఆశా కార్యకర్తలకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ గీతాంజలి మాట్లాడుతూ ఈనెల 20వ తేదీ నుండి నులిపురుగుల పంపిణీ చేస్తున్నామని అల్బెండజోల్ మాత్ర నులి పురుగుల సంక్రమణను నియంత్రించుటలో సహాయపడుతుందని, మండలంలోని అన్ని కళాశాలలు, పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాల్లో పిల్లలందరికీ ఉచితంగా నులి పురుగుల నిర్మూలన మాత్రలు పంపించేస్తున్నామని అన్నారు అలాగే వానకాలంలో సీజన్ వ్యాధులు డెంగ్యూ మలేరియా వ్యాప్తి చెందకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలను వారికి వివరించారు ఈ కార్యక్రమంలో డాక్టర్ గీతాంజలి ఇంచార్జ్ ఎంపీడీవో రాజేందర్. హెచ్ ఈ ఓ యాదగిరి. ప్రసాద్ ఏఎన్ఎంలకు అంగన్వాడీ టీచర్లు ఆశా కార్యకర్తలకు తదితరులు పాల్గొన్నారు.