విజయవాడలో పోలీసుల తనిఖీలు నిర్వహించారు. అక్కడ ‘పిఠాపురం ఎమ్మెల్యే తాలూకా’ ప్లేటుతో ఉన్న బైక్‌ను పోలీసులు గుర్తించారు. ఇలా నంబర్ ప్లేట్ లేకుండా వాహనం నడపడం నేరమని, ఒక వేళ బైక్ పోయినా గుర్తించలేమని వాహనదారుడికి అవగాహన కల్పించారు. మీ అభిమానాన్ని బైక్‌పై వేరే చోటు ముద్రించాలని, నంబర్ ప్లేట్ మీద కాదని వార్నింగ్ ఇచ్చారు. ఈ మేరకు పోలీసులు పాత బోర్డును తొలగించి ఆర్టీఏ ఇచ్చిన బోర్డును పెట్టించారు.